శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: బుధవారం, 19 డిశెంబరు 2018 (17:55 IST)

పేటీఎం బంపర్ ఆఫర్... జీరో అదనపు ఛార్జీలతో ఆన్‌లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్స్

బెంగళూరు: వన్ 97 కమ్యూనికేషన్స్ యాజమాన్యంలోని బ్రాండ్, అయిన పేటీఎం, భారతదేశం యొక్క అతిపెద్ద డిజిటల్ చెల్లింపులు సంస్థ తమ వేదిక ద్వార జరిగే ట్రైన్ టికెట్ బుకింగ్స్ పైన లావాదేవీల ఛార్జీలు, పేమెంట్ గేట్వే మరియు సర్వీస్ చార్జెస్‌ను రద్దు చేస్తున్నట్లు నేడు ప్రకటించింది. రద్దు చేసిన టికెట్స్ పైన ఒక నిమిషం లోపు ఇన్స్టాంట్ రీఫండ్ మరియు పీఎన్ఆర్ స్టేటస్ చెకింగ్‌తో పాటు టికెట్ బుక్ చేయడానికి నేడు దేశం యొక్క అత్యంత ప్రాధాన్యత గల ఆన్లైన్ వేదికగా పేటీఎం మారింది.
 
ఈ సందర్భంగా పేటీఎం ఉపాధ్యక్షుడు అభిషేక్ రాజన్ మాట్లాడుతూ...."ఎటువంటి సర్వీస్ చార్జెస్ లేదా పేమెంట్ గేట్వే ఛార్జ్ లేదా ఇతర రకాల ఫీజు చెల్లించకుండా వినియోగదారులు పేటీఎం వేదిక పైన ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రకటించినందుకు మేము ఆనందంగా ఉన్నాము". దీని ద్వారా ఆన్లైన్లో తక్కువ ఖర్చుతో ట్రైన్ టికెట్ల బుకింగ్ మరియు ఎటువంటి అవాంతరం లేని ఛానల్‌గా ఆన్లైన్లో మరింత ఎక్కువ మంది ప్రయాణీకులను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ఈ ముందడుగు." అని అన్నారు.
 
ఆసక్తికరంగా, పేటీఎం మొబైల్ యాప్ వేదిక ద్వారానే అత్యంత ఆన్లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మొట్టమొదటి వినియోగదారుల ఆన్లైన్‌లో ట్రైన్ టికెటింగ్ సరళీకృతం చేయడానికి వివిధ నూతన ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ, మొబైల్ పైనే ఆధారపడే ప్రయాణికుల అవసరాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ సంస్థ ఎంతో తోడ్పాటును ఇస్తుంది. తరచుగా ప్రయాణం చేసే ప్రయాణికులు అదనపు సమాచారం పూరించకుండా కొన్ని సులభమైన క్లిక్ల్‌ల‌తో పునరావృత బుకింగ్‌లను చేయవచ్చు. అదనంగా, ప్రయాణికులు వారి పీఎన్ఆర్  స్టేటస్‌ని తనిఖీ చేసుకోవచ్చు. ప్రయాణికులు వారి మార్గంలో ప్రవేశించవచ్చు లేదా నగరాలు/పట్టణాలు/ప్రాంతాల/ ప్రదేశాల కోసం శోధించవచ్చు మరియు సమీప రైల్వే స్టేషన్లకు సూచనలను పొందవచ్చు. 
 
దేశంలోని ఆన్లైన్ ట్రావెల్ విభాగంలో ఇప్పటివరకు కొనసాగిన ఆధిపత్య నేపధ్యంలో, భారతీయ ఆన్లైన్ ట్రావెల్‌లో ప్రవేశించిన మొట్టమొదటి డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం. 2018 ఆర్ధిక సంవత్సరంలో 38 మిలియన్ల టిక్కెట్లు కంటే ఎక్కువ విక్రయించింది. ఇంకా, దాని ప్రయాణ వినియోగదారుల బేస్‌ను 9 మిలియన్ చేసుకున్నది.
 
బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న పేటీఎం ట్రావెల్ విభాగం 300 మంది బృందంతో పని చేస్తున్నది. బస్ మరియు విమాన టిక్కెట్లలో ఉచిత రద్దు వంటి వినియోగదారుల-ఆధారిత లక్షణాలను ప్లాట్ఫాం అందిస్తుంది, తద్వారా ప్రయాణికులు రద్దు చేసిన టికెట్ల పైన కోట్లాది రూపాయల రుసుమును ఆదా చేయడంలో సహాయపడింది.