శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (11:56 IST)

Jio Celebrations Pack.. రోజుకు 2జీబీ.. ఐదు రోజులకు 10జీబీ

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కొత్త ప్లానును ప్రవేశపెట్టనుంది. రిలయన్స్‌కు చెందిన కొందరు వినియోగదారులకు ఉచితంగా రోజుకు 2జీబీ కింద అదనపు డేటాను అందించనుంది. ఐదు రోజుల వ్యవధిలో పది జీబీ డేటాను అందిస్తూ జియో సెలబ్రేషన్స్ ప్యాక్‌ను పొడిగించడం జరిగిందని రిలయన్స్ జియో తెలిపింది. 
 
ఇంతకుముందు జియో సెలబ్రేషన్స్ ప్యాక్ కింద వున్న డేటా ప్రయోజనాలు నాలుగు రోజుల వరకే వుండేది. ప్రస్తుతం ఈ ప్యాక్ కింద డేటా ప్రయోజనాలను ఐదు రోజులకు పొడిగించారు. 
 
ఇదిలా ఉంటే.. ముంబైకి చెందిన ఈ టెలికాం సంస్థ జియో దీపావళి ధమాకా కింద వంద రోజుల క్యాష్ బ్యాక్‌ను రూ. 149లకే అందించింది. తాజాగా జియో సెలెబ్రేషన్స్ ప్యాక్ పొందేందుకు అర్హత కలిగిన వినియోగదారులకు 2జీబీ రోజు వారీ డేటాగా అందుతుంది. ఈ డేటా పది జీబీల కింద ఐదురోజులకు అందుబాటులో వుంటుంది. జియో సెలెబ్రేషన్స్ ప్యాక్ గురించి తెలుసుకునేందుకు మై జియో ప్లాన్‌లో చెక్ చేసుకోవచ్చు.