శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (17:41 IST)

పేటీఎం క్యాష్ బ్యాక్... 12 నుండి 16 డిసెంబర్ 2018 వరకు...

న్యూఢిల్లీ : వన్ 97 కమ్యూనికేషన్ స్వంత బ్రాండ్, భారతదేశంలోనే అతిపెద్ద చెల్లింపుల వేదిక అయిన పేటీఎం, దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల ఫెస్టివల్, ’పేటీఎం క్యాష్ బ్యాక్ డేస్’ను డిసెంబర్ 12 నుండి 16 డిసెంబర్, 2018న ఆవిష్కరించింది. దేశంలోని 10 మిలియన్ కంటే ఎక్కువ గల మర్చంట్ అవుట్లెట్స్ వద్ద, అంటే ఆర్గనైజ్డ్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, ఫార్మసీలు, పెట్రోలు పంపులు, పాల-బూత్స్ నుండి మిలియన్ల కొద్దీ ఉన్న చిన్న రీటైలర్స్ వరకు, పేటీఎంను ఉపయోగించి చెల్లింపులు చేసే వినియోగదారులను ఈ ఫెస్టివల్ లక్ష్యంగా కలిగి ఉంది. ఈ ఉపక్రమం వలన భారతదేశమంతటా గల పేటీఎం మర్చంట్స్ భాగస్వాములందరికీ గొప్ప విక్రయాలు మరియు ఒప్పందాలు జరపబడతాయి. దీనితో వారి వ్యాపారం బహుముఖంగా అభివృద్ధి చెందుతుంది. రాబోవు సంవత్సరాలలో ప్రత్యేక సందర్భాలలో ఇలాంటి వేడుకను పేటీఎం కొనసాగిస్తూనే ఉంటుంది.
 
పేటీఎంను ఆమోదించే దేశంలోని 100+ అతిపెద్ద బ్రాండ్స్ మరియు చిన్న రీటైల్స్ ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. పాల్గొంటున్న వారిలో కొన్ని అతిపెద్ద పేర్లలో ఉబెర్, బిగ్ బజార్, జొమాటో, 24 సెవెన్, కొలంబియా ఏషియా, ఫోర్టిస్, కేఫ్ కాఫీ డే, ఇండియన్ టెర్రైన్, బిబా, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ఫ్రెష్, సూపర్ 99, సెంట్రల్, హెరిటేజ్ ఫ్రెష్, యుఎస్ పోలో, ఫ్లైయింగ్ మిషిన్, ఎడ్ హార్డీ, చాయోస్, పిజ్జా హట్, బీర్ కేఫె, చాయ్ పాయింట్, మాడ్ ఓవర్ డోనట్స్, స్పెన్సర్స్, విఐపి బ్యాగ్స్ మరియు జూమ్ కార్  ఉన్నాయి. 
 
ఈ సందర్భంగా కిరణ్ వాసిరెడ్డి, సిఓఓ- పేటీఎం,  మాట్లాడుతూ....."భారతదేశంలోని ఇన్-స్టోర్ చెల్లింపుల కొరకు వినియోగదారులకు, పేటీఎం అనేది ఒక ఇష్టమైన చెల్లింపు ఎంపికగా మారింది. నేడు, పేటీఎంను, భారతదేశంలోని అతిపెద్ద బ్రాండ్ అవుట్లెట్స్ నుండి ఆన్లైన్ వేదికలు మరియు చిన్న రీటైలర్స్ వరకు అన్ని అతిపెద్ద రకాల స్టోర్స్ వద్ద, అందరూ అంగీకరిస్తున్నారు. ’పేటీఎం క్యాష్ బ్యాక్ డేస్’ తో, పేటీఎం ను తమకిష్టమైన ఎంపిక చేసుకుని ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ మర్చంట్స్ వద్ద చెల్లింపులు చేస్తున్న మా వినియోగదారులకు, ఉత్తమ డీల్స్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ రూపంలో బహుమతిని అందిస్తున్నాము. దేశంలో మొబైల్ చెల్లింపుల స్వీకరించుటకు మరియు మా మర్చంట్ భాగస్వాములకు గణనీయంగా తోడ్పడుటకు చేసే మా ప్రయత్నాలలో ఇది ఒక గణనీయమైన భాగంగా ఉంటుంది.”

 
వినియోగదారులు బిగ్ బజార్లో రూ. 2000ల పై కొనుగోలు పైనా రూ. 200ల ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు, సెంట్రల్ స్టోర్స్‌లో కనీస కొనుగోలు రూ. 2500 లపై వారు రూ. 300ల క్యాష్ బ్యాక్‌కు అర్హులు. ఈ ప్రచారంలో, రెస్టారెంట్లలో తినడంలో కూడా భారీ తగ్గింపు అందిస్తుంది, బీర్ కేఫెలో 15%, వాంగోలో మరియు మ్యాడ్ ఓవర్ డోనట్స్‌లో 250 బిల్లుపై 20% తగ్గింపు, కేఫ్ కాఫీ డేలో రూ. 350 బిల్లుపై 15% క్యాష్ బ్యాక్ మరియు చాయోస్‌లో రూ. 350 కంటే ఎక్కువ బిల్లులపై 20% తగ్గింపు పొందవచ్చు. 
 
అంతేకాదు ఫ్యాషన్ మరియు దుస్తులలో కూడా అద్భుతమైన డీల్స్ అందుకొవచ్చు. ఉదాహరణకు: భారతదేశమంతటా, యుఎస్ పోలోలో వారు రూ. 3,999 ల కనీస బిల్లుపై 20% క్యాష్ బ్యాక్‌ను, వుడ్డ్ ల్యాండ్ వద్ద 15% ప్లాట్ తగ్గింపును మరియు ఎడ్ హార్డీ మరియు ఫ్లైయింగ్ మిషిన్ స్టోర్స్ వద్ద 20% ఫ్లాట్ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. పేటీఎం యూజర్లు, వారి సమీప స్టోర్స్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా ఉత్తేజభరిత డీల్స్ మరియు క్యాష్ బ్యాక్స్ ను ఆనందించవచ్చు.