సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (11:10 IST)

అమేజాన్ ఇండియా సేల్.. జియోమీ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు

ఎమ్ఐ మ్యాక్స్2, రెడ్‌మీ6 ప్రోలపై అమేజాన్ ఇండియా భారీ ఆఫర్లను ప్రకటించింది. జియోమీ ఉత్పత్తులపై అమేజాన్ లిమిటెడ్ ప్రమోషనల్ సేల్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 14 వరకు ఈ సేల్ వుంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అమేజాన్ ఇండియా పునర్నిర్మించిన ఉత్పత్తులపై ఆరు నెలల వారంటీని అందిస్తోంది. ఈక్విన్ లావాదేవీలపై ఐదు శాతం ఈఎంఐ ఆఫర్‌ ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకుతో అమేజాన్ తెలిపింది. 
 
రీఫర్‌బిష్డ్ (పునర్మించిన) ఎమ్ఐ ఉత్పత్తుల సేల్, జియోమీ రెడ్‌మీ6 ప్రో (3జీబీ,32జీబీ)లు డిస్కౌంట్ ధర రూ.9,899 ధరకు వినియోగాదారులకు అందించనుంది. దీని అసలు ధర రూ.11,499. దీని రెగ్యులర్ వర్షన్ రూ.10.999లకు కస్టమర్లకు అందుబాటులో వుంటుంది. ఇది 4జీబీ రామ్, 64 జీబీ వేరియంట్‌ను కలిగివుంది. ఇదే తరహాలో రెడ్ మీ 6 ప్రో రూ.11,699 (అసలు ధర రూ.13,499)కు లభిస్తుంది. 
 
అమేజాన్ ఇండియా సేల్‌లో భాగంగా ఎమ్ఐ మాక్స్ 2 (4జీబీ, 64జీబీ), రెడ్‌మీ వై2, ఎమ్ఐ ఏ1, ఎమ్ఏ2, ఎమ్ఐ రెడ్‌మీ 5 (3జీబీ, 32జీబీ)లు కూడా డిస్కౌంట్ రేట్లలో లభిస్తాయి. వీటితో పాటు ఎమ్ఐ 3 జీసీ వైర్‌లెస్ రూటర్, ఎమ్ఐ బాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్లు కూడా డిస్కౌంట్లలో లభిస్తాయి.