మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 13 డిశెంబరు 2018 (21:00 IST)

తెలుగు సినిమాలంటేనే వణికిపోతున్న మాధవన్... ఎందుకు?

అందగాడు మాధవన్. ఇటీవలే ఒక తెలుగు సినిమాలో నటించాడు. సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మాధవన్. తమిళ సినిమా అయినా డబ్బింగ్‌తోనే తెలుగువారిని అలరించాడు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం రీసెంట్‌గానే ఎంట్రీ ఇచ్చాడు. సవ్యసాచి సినిమాలో విలన్‌గా నటించాడు. సవ్యసాచి సినిమా అపజయాలు పాలు కావడం, ఆయన పాత్ర విమర్శలకు గురికావడంతో మాధవన్ ఇప్పుడు తెలుగు సినిమాలు ఒప్పుకునేందుకు జంకుతున్నాడట. 
 
చెప్పే కథకి, తీసే సినిమాకు తేడా ఉంటోందని బాధపడుతున్నాడట మాధవన్. అందుకే సవ్యసాచి విడుదలకు ముందు మరో తెలుగు సినిమాను ఒప్పుకుని ఇప్పుడు ఆ సినిమాను చేయనని తేల్చి చెప్పేశాడట మాధవన్. రవితేజ హీరోగా ఒక కొత్త సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో విలన్‌గా మాధవన్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ పుకార్లేనంటున్నాడు మాధవన్. ప్రస్తుతానికి తెలుగులో నటించే ఆలోచనలో లేదంటున్నాడు మాధవన్.