గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 7 నవంబరు 2018 (14:35 IST)

బెడ్రూంలో నన్నలా చూడగానే అరిచి దభేల్‌మని పడిపోయింది... ఏం చేయాలి?

పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లయిన తర్వాత నేను వృత్తిరీత్యా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల మా కలయిక కుదర్లేదు. 6 నెలల తర్వాత ఇటీవలే ఇంటికి వచ్చాను. ఎంతో ఆశగా నా భార్యతో శృంగారం చేయాలని ఆ రాత్రి పడక గదికి చేరిన నాకు చేదు అనుభవం ఎదురైంది.
 
శృంగారం చేసేందుకు నేను సమాయత్తమయ్యాను. కానీ స్తంభించిన నా వ్యక్తిగత భాగాన్ని చూసి ఆమె కేక వేసి పడిపోయింది. నాకు భయం వేసి ఆమె ముఖంపై నీళ్లు చల్లాను. లేచి కూర్చుని వెంటనే పక్క గదిలోకి వెళ్లిపోయింది. ఏమిటని అడిగితే... అదంటే భయమంటోంది. అప్పటికీ ధైర్యం చేసి శృంగారం చేయబోతే వణికిపోతోంది. ఈ విషయం పెద్దలకు చెబితే ఏమవుతుందోనని మరో ఆందోళన. ఏం చేయాలి.
 
ఇలాంటి సమస్య కొంతమంది ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం కొందరు స్త్రీలలో శృంగారం పట్ల ఉన్న భయం. శృంగారం చేయగానే కన్నెపొర చిరిగిపోతుందనీ, రక్తం కారుతుందనీ... ఇలా ఏవేవో భయాలను కలిగి ఉంటారు. ఇలాంటివారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని కొన్నాళ్లు సెక్సీ భాగాలను తాకుతూ ముద్దాడాలి. ఆ తర్వాత మెల్లగా వారే శృంగార పరంగా ఉద్రిక్తచెందాక రతికి ఉపక్రమించాలి. అంతేతప్ప నేరుగా అక్కడికే వెళితే సమస్య ఇలాగే ఎదురవుతుంది.