గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (14:32 IST)

వేపాకు నూనెను మహిళలపై పొట్టపైన మాత్రం రాసుకోకూడదట..?

వేపాకును రోజూ ఓ అర స్పూన్ ఆహారంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. వేపాకు పొడిని స్త్రీల గర్భాశయంపైనా కూడా ప్రభావం చూపుతుందట.  గర్భాశయంలో ప్రవేశించిన వీర్య కణాలను కూడా నశింపజేసే శక్తి దీనికి ఉందట. అందువల్ల మహిళ తన పొట్టపైన ఎట్టి పరిస్థితుల్లోనూ వేపాకును కానీ వేప నూనెను కానీ రాసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
చాలామంది ఉదయం లేవగానే వేపాకును నూరి ముద్దగా చేసుకుని మింగేస్తే రోగాలు తగ్గిపోతాయనుకుంటారు. కానీ ఇది నిర్ణీత మోతాదులో సేవిస్తే మంచి ఫలితాన్నిస్తుంది. కానీ మోతాదుకి మించి తీసుకుంటే మాత్రం ఉదరానికి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మధుమేహ రోగులకు బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు కొద్ది మోతాదులో వేప నూనెను తీసుకోమని వైద్యులు చెపుతుంటారు. ఐతే నిర్ణీత మోతాదుకు మించి వేప నూనెను తీసుకోవడం కూడదని, ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు వేపాకును వాడాలి.