మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (09:47 IST)

నా హత్యకు కుట్ర : ఏ.రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ వర్కింగ్ కమిటి (టీపీసీసీ) ఏ.రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపణలు చేశారు. సుశిక్షితులైన పోలీసులతో తనను హత్య చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని.. అందుకోసం పోలీసులను రంగంలోకి దింపిందని ఆరోపించారు. మఫ్టీలోని పోలీసులు తనపై దాడికి పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 
 
ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినా భద్రత కల్పించకుండా కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తీరా కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేశారు.