లక్ష్మీస్ ఎన్టీఆర్: ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి ఎలా చేరువైందో చూస్తారు..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో వున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వ్యక్తిగతాన్ని ఈ సినిమాలో చూడొచ్చునని వర్మ అన్నారు. క్రిష్ రూపొందిస్తున్న కథానాయకుడులో ఎన్టీఆర్ సినీ జీవితం, మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం చూస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో తారక రామారావు గారి వ్యక్తిగత జీవితం వుంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమా చూడొచ్చునని వర్మ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ పెద్ద స్టార్. ఆయనకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే ఆమె ఓ సాధారణ మహిళ. పెద్ద అందగత్తె కూడా కాదు. అలాంటి ఆమె ఎన్టీఆర్‌కు ఎలా చేరువైంది.. అనేది ఈ సినిమాలో చూడొచ్చు. తన పరిశోధన కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని వర్మ చెప్పుకొచ్చాడు.