శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (09:46 IST)

చెల్లెమ్మను వివాహం చేసుకున్న అన్నయ్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

అన్నయ్య చెల్లెమ్మను పెళ్లాడటం శాస్త్ర విరుద్ధం అంటారు పెద్దలు. అయితే పంజాబ్‌లో తన తోడబుట్టిన చెల్లెల్ని అన్నయ్య వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్ విచారణలోనే ఈ వ్యవహారం బయటపడింది. ఇంకా చెల్లెల్ని అన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే దానిపై జరిపిన దర్యాప్తులో.. అన్నయ్యకు ఆస్ట్రేలియా పౌరసత్వం వుంది. 
 
అదేవిధంగా ఆస్ట్రేలియాలో పౌరసత్వం పొందాలంటే.. దాదాపు ఆరు సంవత్సరాలు అక్కడ బస చేయాల్సి వుంటుంది. అలాగే ఆస్ట్రేలియా పౌరసత్వంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుకే చెల్లెమ్మను అన్నయ్య వివాహం చేసుకుని ఆస్ట్రేలియా పౌరసత్వం ఆమెకు లభించేలా చేశాడని తెలిసింది. 
 
ఇంకా విదేశాలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే పంజాబ్‌కు చెందిన అన్నయ్య.. సొంత తోబుట్టువునే పెళ్లి చేసుకున్నాడని.. వెల్లడి అయ్యింది. ఇది ఆచారానికి విరుద్ధమని విమర్శలు వచ్చినా.. సోదరిని సోదరుడు వివాహం చేసుకోవడంపై ఎవ్వరూ అడ్డు చెప్పే అవకాశం లేదు. దీంతో అన్నాచెల్లెల్లు అలా ఆస్ట్రేలియా పౌరులుగా మారిపోయారని పోలీసులు తెలిపారు.