ప్రేమ పెళ్లి.. అనుమానం.. ఆఫీసుకు వెళ్లి మరీ వాగులాట.. చివరికి కత్తితో?

Last Updated: గురువారం, 31 జనవరి 2019 (11:55 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆఫీసుకు వెళ్లి మరీ ప్రతీకారం తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన కుమార్ అనే వ్యక్తి వీనా అనే మహిళను గత ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ వేర్వేరు కంపెనీల్లో పనిచేస్తూ వచ్చారు. అయితే కుమార్‌కు వీనా ప్రవర్తనలో అనుమానం ఏర్పడింది. 
 
దీంతో ఈ దంపతుల మధ్య వివాహం చోటుచేసుకుంది. ఒక దశలో భర్త వేధింపుల్ని తాళలేక వీనా తన పుట్టింటికి వెళ్లిపోయింది. వీనా పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కుమార్.. వీనా పనిచేసే కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. వారిద్దరి మధ్య వాగులాట ముదరడంతో.. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో భార్యను హతమార్చాడు. 
 
తీవ్రంగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వీనా ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమార్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై మరింత చదవండి :