శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (15:20 IST)

32 ఏళ్ల యువకుడితో 37 ఏళ్ల భార్య అక్రమ సంబంధం... పొడిచేశాడు...

ఆఫీసులో ఓ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి చంపిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న 32 ఏళ్ల కుమార్‌తో తన 37 ఏళ్ల భార్య వీణ అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో తీవ్ర మనస్థాపం చెంది ఆమెను చంపేసాడు. 
 
వీణా భయాందార్‌లోని ఒక చార్టెడ్ అకౌంట్ ఆఫీస్‌లో పని చేస్తుంది. కుమార్ - వీణా 12 సంవత్సరాల దాంపత్య జీవితంలో ఎప్పుడూ గొడవలు పడుతూనే వుండేవారు. దీనితో కలత చెందిన వీణా జనవరి 2న ఇల్లు వదిలి వెళ్లిపోయింది. భార్య కనిపించకుండా పోవడంతో కుమార్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. 
 
పోలీసులు ఆమెను వెతికి తీసుకురాగా ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయినందుకు గల అసలు కారణాలను తెలిపింది. దీనితో ఆగ్రహించిన కుమార్ మంగళవారం ఉదయం 10:30 గంటలకు వీణా పని చేస్తున్న కంపెనీకి నేరుగా వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇరువురూ గట్టిగా వాదులాడుకున్నారు. చివరకు కుమార్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి అక్కడి నుండి పారిపోయి పోలీసులకు లొంగిపోయాడు.