1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. A Lady teacher romance with student, caught

విద్యార్థికి పాఠాలు చెప్పడం మాని శృంగారాన్ని రెచ్చగొట్టింది...

Lady teacher
మంచి మాటలు చెప్పి పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాల్సిన టీచరే విద్యార్థికి ఆ పాఠాలు నేర్పింది. ఆ టీచర్ వయస్సు 30 ఏళ్లు కాగా విద్యార్థి వయస్సు 18 ఏళ్లు. న్యూజెర్సీలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో 30 ఏళ్ల జెస్సికా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఈవిడ తన విద్యార్థుల్లో ఒకడైన 18 ఏళ్ల బాలుడిపై మనసు పారేసుకుంది.
 
ఆ విద్యార్థితో ఏకాంతంగా మాట్లాడటం, అతనికి లైంగిక ఆలోచనలు కలిగేలా చేయడం వంటి పనులు చేసేది. కొద్దికాలానికే అతనితో పలుమార్లు శృంగారంలో కూడా పాల్గొన్నది. అయితే విద్యార్థి కదలికలపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతని ఫోన్‌ను పరిశీలించగా అందులో ఆమె ఫోటోలు కనిపించడంతో అసలు విషయం బయటపడింది.
 
ఆ టీచర్‌పై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థితో కలిసి దాదాపు అన్ని ఆధారాలను నాశనం చేసింది. అయితే పోలీసులు అతి కష్టంమీద ఒక ఆధారాన్ని సంపాదించడంతో టీచర్‌కు కటకటాలు తప్పలేదు. అయితే మైనారిటీ తీరని బాలుడితో శృంగారంలో పాల్గొనడం వల్ల టీచర్‌కు ఎక్కువ శిక్ష పడే అవకాశాలున్నాయి.
About Writer
కుమార్
తర్వాతి కథనం
ఆస్ట్రేలియాలో అశ్లీల వీడియోలతో పట్టుబడ్డ ఇండియన్... రూ. 3.75 కోట్ల జరిమానా?