సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (14:38 IST)

గోపీచంద్‌ కోసం బాలీవుడ్ భామ... నో చెప్పిన లక్ష్మీ - హంసా

టాలీవుడ్ హీరో గోపీచంద్. ఈయన తాజాగా తిరు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. కానీ, హీరోయిన్లు మాత్రం ఇప్పటివరకు ఎంపిక చేయలేదు. విశాల్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర కథ స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగనుంది. 
 
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇండో- పాక్ సరిహద్దుల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా మంచి క్రేజ్ వున్న హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇక రెండో కథానాయికగా రాయ్‌లక్ష్మినిగానీ.. హంసా నందినినిగానీ తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరిపారట. ఇద్దరూ కూడా భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో, బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్‌ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 
ఈ ఇద్దరికన్నా తక్కువ పారితోషికమే ఆమె తీసుకుంటోంది. అందువల్ల ఆమె ఎంపిక ఖరారు కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక మొదటి కథానాయికాగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.