ఈయనేమైనా శృంగారం పిచ్చోడా...? నన్ను పిలిచి తలుపేసి...
మాది ధనవంతుల కుటుంబం. తరతరాల ఆస్తి సంక్రమించడంతో మా ఆయన ఇల్లు వదిలి బయటకు వెళ్లడు. డబ్బుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ముఖ్యమంగా నా సంసార జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా భర్త నన్ను ఓ శృంగార బొమ్మలా చూస్తాడు. మూడ్ వస్తే... ఎప్పుడు పడితే అప్పుడు బెడ్రూంలోకి లాక్కుని వెళ్లిపోతాడు. అదేమని అడిగితే... నా ఇష్టం అంటాడంతే.
ఇంట్లో ఎంతమంది వున్నా పట్టించుకోడు. అది కావాలనిపిస్తే అంతే... నన్ను పిలిచి తలుపేసి మొదలుపెడతాడు. ముగిశాక అయిపోయిందన్నట్లు తన దారిన తాను వెళ్లిపోతాడు. నేను బయటకు వస్తే అందరూ అదోలా చూస్తుంటారు. శృంగారాన్ని రాత్రి మాత్రమే చేసుకుందామని ఎన్నిసార్లు బ్రతిమాలుతున్నా పట్టించుకోవడంలేదు. ఇతడేమైనా శృంగారం పిచ్చోడా...? మా తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల డబ్బున్నవాడికిస్తే ఏదో గొప్పగా బతుకుందని అనుకున్నారు. కానీ నా సంసారంలో జరుగుతున్న సమస్య వారికి చెప్పలేను. అతడిని మామూలు మనిషిగా మార్చేదెలా?
మీరు అనుకునేది వాస్తవం కాదు. పెళ్లయిన కొత్తలో చాలామంది పురుషులు ఇలాగే ఉంటారు. శృంగార సుఖం కోసం సిగ్గు విడిచి ప్రవర్తిస్తుంటారు. మీరు కాస్త పద్ధతిగా పెరిగినందువల్ల అతడి ప్రవర్తన మీకు తేడాగా అనిపిస్తోంది. ఐతే ఇంట్లో అందరూ వుండగా అతడలా ప్రవర్తించడం తప్పే. అతడితో ఏకాంతంగా మాట్లాడి, అన్ని విషయాలను చెప్పాలంటే మీరు ఆ ఇంట్లో నుంచి కొన్నాళ్లు మీ భర్తతో సహా బయటకు రావాలి.
ఎలాగో నచ్చజెప్పి మీ అమ్మవారి ఇంటికి తీసుకుని వెళ్లండి. అక్కడ వారి పద్ధతులు చూసైనా అతడిలో మార్పు రావచ్చు. ఆ తర్వాత మరికొన్నాళ్లు విహార యాత్రలకు వెళ్లండి. ఎలాగూ డబ్బుకు కొదవలేదంటున్నారు కనుక అతడు కూడా అడ్డు చెప్పకపోవచ్చు. అక్కడ మీ మనసులోని భావాలన్నిటినీ అతడితో పంచుకోండి. తప్పకుండా మీకు సహకరిస్తాడు.