పురుషుల్లో శృంగార సామర్థ్యం ఎందుకు తగ్గిపోతుందో తెలుసా?
ఇటీవలి కాలంలో తీసుకునే ఆహారం, అధిక పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం వల్ల పురుషుల్లో చాలామందిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య శీఘ్రస్ఖలనం. ఈ సమస్యకు మందులు వాడిన అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కాని పూర్తిగా కాదు. అయితే మనకు ప్రకృతి ఇచ్చిన కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అన్నింటి కన్నా ముందు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ ఆవు నెయ్యి, అరస్పూన్ తేనెను ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో చప్పరిస్తూ, రాత్రి సమయంలో పాలు తాగితే అంగస్తంభన సమస్యను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వీర్యవృద్ధిని పెంచుతుంది.
2. ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, తరచుగా అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్ద్యం పెరుగుతుంది.
3. ఒక టీ స్పూన్ క్యారెట్ విత్తనాలను ఒక గ్లాసు ఆవుపాలలో దాదాపు పది నిముషాలు మరిగించి తీసుకుంటే శీఘ్రస్ఖలన సమస్య తగ్గుతుంది.
4. ఒక స్పూన్ ముల్లంగి గింజల్ని ఆవు పాలలో వేసి బాగా కాచి, చల్లార్చి వడకట్టి, ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే శీఘ్ర స్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు.