శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (14:01 IST)

ఎక్కువగా ఆవేశపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..?

సహజంగా స్త్రీలలో చాలా మందికి కొన్ని కొన్ని సందర్భాలలో ఆవేశం వస్తుంది. ఒక్కోసారి ఈ ఆవేశం ఎన్నో రకాల అనర్థాలకు దారితీస్తుంది. ఈ ఆవేశం కారణంగా విపరీతమైన కోపం, విసుగు వస్తుంది. దాంతో ఎవర్ని చూసినా తిట్టేస్తుంటారు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే...
 
1. ఓ 10 నిమిషాలు స్థిమితంగా కూర్చుని ఆవేశానికి కారణం ఆలోచించండి.
 
2. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ సమయం కేటాయించి విపరీతంగా ఆలోచించకండి.
 
3. ఎదుటి మనిషి మీద ఆవేశం కలిగితే వెంటనే ఆ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోండి. వీలైతే ఒకటి రెండు రోజులైనా సరే. ఆవేశం చల్లారాక నిజం గ్రహించగలుగుతారు.
 
4. మీకు సన్నిహితం అనుకునే మనుష్యులకే, మనస్సు విప్పి చెప్పుకోండి. కొంత ఆవేశం తగ్గుతుంది. లేదా ఒకటి నుండి వంద అంకెలు లెక్కించండి.
 
5. మీకింకా ఆవేశం తగ్గకపోతే మీకిష్టమైన నవలో, టి.వీ కార్యక్రమమో లేదా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వండి. అంతేకానీ, ఆవేశంతో మాటలు జారకండి. ఆలోచించండి.
 
6. ఆందోళనకి గురి కాకుండా వైద్య సలహా పాటిస్తే మంచిది. అంతేకానీ మీలో మీరే కుమిలిపోకండి.