శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (15:59 IST)

ఇంటి బడ్జెట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే..?

ఇంటి బడ్జెట్‌ని లోటు బడ్జెట్ కాకుండా ప్లాన్ చేసుకోవడం ఇల్లాలికి క్లిష్టతరమైన బాధ్యతే.. అయితే దానికి ఈ క్రింది సూచనలు పాటిస్తే మీరు మంచి హోమ్ ఫైనాన్స్ మినిష్టరు కావచ్చు..
 
1. ఇంటి బడ్జెట్ లోటు బడ్జెట్ కాకుండా ఉండాలంటే పొదుపే ఏకైక మార్గం. అవసరాలను గుర్తించి, అంచనాలు తయారుచేసుకుని దుబారా ఖర్చును తగ్గించాలి. 
 
2. అవసరం లేని చోట ఖర్చు పెట్టాలని ఎవరైనా అనుకుంటున్నారో ఓపికగా వారికి డబ్బు యొక్క ఆవశ్యకతను చక్కగా వివరించి చెప్పాలి. 
 
3. కూరగాయలను వారానికి ఒకసారి ఉదయాన్నే మార్కెట్‌కి వెళ్ళి చౌకగా కొనాలి. వాటిని శుభ్రపరచి నిల్వచేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. 
 
4. పనిమనిషి, రిక్షా, ఆటో మొదలైన వాటిని చాలా తక్కువగా ఉపయోగించుకోవాలి. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు, షాపింగ్స్, యాత్రలు చేయడం తగ్గించాలి.
 
5. పిల్లల్ని ట్యూషన్‌కి పంపకుండా, మీ చదువుకు సార్థకత వచ్చేందుకు పిల్లలకు స్వయంగా చదుపు చెప్పడం, వీలైతే వారికి ట్యూషన్ చెప్పడం చేయాలి.
 
6. అల్లికలు, కుట్లు, ఫాబ్రిక్ పెయింటింగ్ లాంటి హాబీలు మీకుంటే వాటి ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలు చూసుకోవాలి.