గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (13:36 IST)

ఎత్తు తక్కువగా ఉన్నవారు పొడుగ్గా...?

ఎత్తు తక్కువగా ఉన్నవారు పొడుగ్గా కనిపించాలనుకోవడం తప్పేమి కాదు. అందుకు ఎత్తుమడమలున్న పాదరక్షలు ధరిస్తే సరిపోదు. దుస్తుల ఎంపిక కూడా ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడే కొంతైనా మార్పు తీసుకురావొచ్చు. గీతలున్న దుస్తులను ధరించడం వలన కాస్త పొడుగ్గా కనిపిస్తారు. టాప్‌ డిజైన్‌లోని అల్లికలు కూడా నిలువుగా ఉంటే బావుంటుందని గమనించాలి.
 
చిన్న పువ్వులు, ప్రింట్లు, తక్కువ అల్లికలు ఉన్న వస్త్రాలు మిమ్మల్ని మరింత ఎత్తుగా కనిపించేలా చేస్తాయి. ఇలాంటి డిజైన్లు, ఒకే రంగుల్లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. చీరలు ధరిస్తున్నప్పుడు పెద్ద పెద్ద అంచులున్నవి ఎంచుకోకూడదు. సన్న ప్రింట్లున్నవి, తక్కువ అంచున్న రకాలను ఎంచుకుంటే చూడముచ్చటగా ఉంటాయి. జీన్స్‌ లాంటివి కొంటున్నప్పుడు, ఏవో ఒకటి కాకుండా.. కప్డ్ రకాలను కొనడం మేలు. వీటివల్ల పొడుగ్గా కనిపిస్తారు. అప్పుడు హైహీల్స్‌ ధరిస్తే ఆ అందమే వేరు.
 
సన్నటి నిలువు గీతలున్న టాప్‌ ధరించినప్పుడు పొడుగ్గా కన్నా వెడల్పుగా కనిపిస్తాం. అదే సమయంలో సన్నని అడ్డగీతలున్న దుస్తులు బట్ట అంతా ఉన్న వాటిని ధరిస్తేనే పొడుగ్గా కనిపిస్తారు. రెండు రంగులతో కాంట్రాస్ట్‌ రకాలను ఎంచుకోవడం పొరబాటు. దానివలన వాటి మధ్యనున్న తేడా అడ్డంగా ఓ గీతలా కనబడుతుంది. ఇది మరింత చిన్నగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి మీరు ధరించే డ్రెస్‌ రెండింటినీ ఈ తరహాల్లో ఎంచుకోకపోవడమే మంచిది.