మేకప్ వేసుకోవడం ఎలా..?
చాలామంది మేకప్ చేసుకోవడానికి బ్యూటీ పార్లల్‌కు వెళ్తుంటారు. కొంతమంది వెళ్లలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారికి ఇంట్లోనే ఎలా మేకప్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం..
1. మేకప్‌లో మొదట చేయవలసింది ఫౌండేషన్. ఫౌండేషన్ మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసేటప్పుడు అంతటా సమరీతిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
2. పౌడర్ రూపంలో లభించే ఫౌండేషన్ కన్నా లిక్విడ్ రూపంలో లభించే ఫౌండేషన్ మంచిది. శరీరపు ఛాయను బట్టి ఫౌండేషన్ రంగును ఎంచుకోవాలి. ఫౌండేషన్ అప్లై చేశాక ముఖానికి పౌడర్ అద్దాలి. ఈ పౌడర్ యూనిఫాంగా ఉండాలి.
3. ఫౌడర్‌ని అతిగా అప్లై చేయడం మంచిది కాదు. ఎక్సెస్ ఫౌడర్‌ని రిమూవ్ చేసుకోవాలంటే పఫ్‌తో నెమ్మదిగా తుడిచి చేయాలి. కళ్ళకింద ముఖం యొక్క చర్మం జారిపోయినట్లుగా ఉండే స్త్రీలు డార్క్ కలర్ పౌండేషన్‌ని అప్లై చేసుకోవాలి.
4. కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించకుండా ఉండాలంటే వైట్ కలర్ పౌండేషన్‌ని అప్లై చేసుకుంటే చాలు. మేకప్ చేసుకునేటప్పుడు ఐబ్రోలను సరిదిద్దుకోవాలి. ఈ విషయంలో చాలా మంది ఐబ్రో పెన్సిల్‌ను తీసుకుని లైన్‌లాగా దిద్దేస్తారు. కాని అది సరైన పద్ధతి కాదు. మీ కనుబొమల దగ్గర పెన్సిల్ ఉంచి ఆపోజిట్ డైరక్షన్‌లో అప్లై చేయాలి. అప్పుడే ఐబ్రోలు నాచురల్‌గా కనిపిస్తాయి.
5. డ్రస్‌ని బట్టి లిప్‌స్టిక్ కాకుండా శరీర రంగుని బట్టి ముఖానికి వేసుకునే మేకప్‌ని బట్టి లిప్‌స్టిక్ రంగులని సెలక్ట్ చేసుకోవాలి. అప్‌లైనర్‌ని ఉపయోగించాకే లిప్‌స్టిక్ రాసుకోవడం మేలైన పద్ధతి.
6. మీ బుగ్గలు అందంగా కనిపించాలంటే బ్లషర్‌తో బుగ్గలకు రోజ్ అప్లై చేసుకోవాలి. గుండ్రటి మొహం కలవారు బ్లషర్‌ని ట్రయాంగిల్ షేపులో వాడాలి. కోలముఖం కలవారు బ్లషర్‌ని వర్టికల్, హారిజాంటల్ డైరక్షన్‌లో అప్లై చేయాలి.