గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (12:14 IST)

బీహార్ షెల్టర్‌లో అశ్లీల నృత్యాలు.. బాలికలను రేప్ చేసిన అతిథులు : సీబీఐ

బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో వెలుగు చూసిన భారీ సెక్స్ స్కామ్‌లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ... అన్ని విషయాలపై కూపీ లాగుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హోంలో ఉంటే బాలికలతో అశ్లీల నృత్యాలు చేయించడమేకాకుండా, బాలికలపై పలువురు అతిథులు అత్యాచారానికి పాల్పడినట్టు సీబీఐ పేర్కొంది. ఈ వ్యభిచార దందాతో పలువురు బ్యూరోక్రాట్లు, రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణ జరిపింది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్రజేష్ థాకూర్‌పై 73 పేజీల చార్జిషీటును సీబీఐ తయారు చేసి కోర్టుకు సమర్పించింది. బడా రాజకీయ నేతలతో పరిచయం ఉన్న బ్రజేష్ థాకూర్ కొన్నేళ్లుగా ఈ షెల్టర్‌ను నడుపుతున్నాడు. ఈ షెల్టర్‌లో ఆశ్రయం పొందే యుక్త వయసు అమ్మాయిలతో బూతు పాటలకు డ్యాన్సులు వేయించడమేకాకుండా, వారితో వ్యభిచారం చేయించినట్టు తేలింది. దీంతో బ్రజేష్ థాకూర్‌తో పాటు 20 మందిని నిందితులుగా పేర్కొని, వీరిందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. 
 
భోజ్‌పురి పాటలకు యుక్తవయసులో ఉండే అమ్మాయిలు నగ్నంగా డాన్సులు వేసేలా ఒత్తిడి చేసేవారు. అందుకు నిరాకరిస్తే వారిని కొడుతూ చిత్ర హింసలకు గురిచేసేవారని సీబీఐ విచారణలో తేలింది. ఈ షెల్టర్‌లో తలదాచుకున్న 42 మంది టీనేజ్ అమ్మాయిల్లో 34 మంది అత్యాచారానికి గురైనట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఇపుడు ఈ నాలుగు అంతస్తుల భవనానికి సీబీఐ అధికారులు సీజ్ చేశారు.