బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (14:45 IST)

ఇలాంటి లిప్‌స్టిక్ ఆ సమయాల్లో వేసుకుంటే..?

మహిళలు పార్టీలకు వెళ్తుంటారు. కానీ, ఏ లిప్‌స్టిక్ వేసుకుంటే.. సరిగ్గా సూట్ అవుతుందో తెలియక సతమతమవుతుంటారు. అయితే ఇలా చేయండి.. చాలు. లిప్‌స్టిక్ ఎంపికలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు బ్యూటీ నిపుణులు. తెలుపు రంగులో ఉన్నవారికి ఎరుపు రంగు లేదా గులాబీ రంగు లిప్‌స్టిక్ ఎంపిక చేసుకోవచ్చు. ఇవి ముదురు రంగులో ఉన్నవారికి అంతగా సెట్‌కావు. 
 
అలానే సున్నితింగా ఉండే పసుపు రంగును.. ఎరుపు రంగు చర్మం గలవారు ఉపయోగించవచ్చును. సిల్వర్, బూడిద రంగులు ఇవి రాత్రిపూట ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా ఉంటాయి. ఎందుకంటే.. ఇవి పెదవులకు మెరుపును అందిస్తాయి తప్ప గాఢమైన ప్రభావాన్ని కలిగించవు. దీనివలన పెదాలు సున్నితమైన మెరుపును కలిగివుంటాయి.
 
నీలం వంటి డార్క్ కలర్ లిప్‌స్టిక్‌లను రాత్రిపూట కంటే పగటిపూట వాడితేనే బాగుంటుంది. ఈ ముదురు రంగు లిప్‌స్టిక్‌లను అరుదైన సందర్భాల్లో తప్ప రోజూ వాడకుంటే మంచిదని బ్యూటీషన్లు అంటున్నారు.