శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (19:09 IST)

ఏడాదికి రెండుసార్లే శృంగారం... దారి తప్పిపోతానేమోనని భయంగా వుంది...

ఫారిన్ సంబంధం అని మా పేరెంట్స్ రెండేళ్ల క్రితం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న అబ్బాయితో నాకు పెళ్లి చేశారు. ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లడంలేదు. ఏడాదిలో రెండుసార్లు వస్తారు. వారం రోజులుంటారు. ఒక్కసారి శృంగారం చేసి వెళ్లిపోతాడు. నాకు శృంగార కోర్కెలు విపరీతంగా ఉన్నాయనీ, ఉద్యోగం మానేసి రమ్మన్నాను. సంపాదన లేకపోతే జనం గడ్డిపోచలా చూస్తారనీ, ఓ 10 ఏళ్లు ఓర్చుకుంటే అంతా సర్దుకుంటుందని చెపుతున్నాడు. 
 
నాకు మాత్రం రోజూ శృంగారంలో పాల్గొనాలని వుంటోంది. వాటిని అణిచిపెట్టుకోలేకపోతున్నాను. స్వయంతృప్తి పద్ధతులు పాటిస్తున్నప్పటికీ నావల్ల కావడంలేదు. కోర్కెలు రాకుండా ఏమయినా మందులుంటే చెప్పండి. లేదంటే దారి తప్పిపోతానేమోనని భయంగా వుంటోంది...
 
ఇటీవలి కాలంలో ఈ ధోరణులు ఎక్కువవుతున్నాయి. సంపాదనే లక్ష్యంగా పురుషులు పరుగులు పెడుతున్నారు. పెళ్లి చేసుకోవడం తప్పించి భార్యతో గడిపే రోజులు చాలా తక్కువయిపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. భార్య కంటే పనికే ప్రాధాన్యత ఇవ్వడం మామూలవుతోంది. దీనివల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. ఆకలి ఎంత సహజమో శృంగార కోర్కెలు కూడా అంతే సహజం. వాటిని తొక్కి పట్టడం సాధ్యం కాదు. ఇకపోతే, విదేశాల్లో పనిచేస్తున్న భర్త, భార్యను కూడా సాధ్యమయినంత త్వరగా అక్కడికి తీసుకెళ్లగలగాలి. 
 
అలా కానిపక్షంలో స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే తగిన ఉద్యోగం చేస్తూ సంసార జీవితాన్ని సాగించాలి. భార్య నోరు తెరిచి చెప్పినప్పటికీ పెడచెవిన పెడితే సమస్య తీవ్రమవుతుంది. కనుక ఆయనకు మీ పెద్దల ద్వారానో, లేదంటే స్నేహితుల ద్వారానో నచ్చజెప్పి మీరు అక్కడికి వెళ్లడమో, లేదంటే ఆయన్నే ఇక్కడికి రప్పించడమో చేయాల్సిందే. శృంగార కోర్కెలు తగ్గిపోవడానికి మందులేమీ లేవు. కాకపోతే ఆ కోర్కెల నుంచి ధ్యాస మళ్లించేందుకు ఆధ్యాత్మిక పుస్తక పఠనం ఒక్కటే దారి. దాన్ని అనుసరించవచ్చు.