గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 28 డిశెంబరు 2018 (17:48 IST)

నా భార్య నస భరించలేక పోతున్నా... తిడుతోంది...

ఐటీ కంపెనీలో పని చేస్తున్నాం. వివాహమై నాలుగేళ్లు అయింది. అప్పటి నుంచి నా భార్యతో శృంగారం అంటే పెద్ద పోరాటమే చేస్తున్నా. ఆ పోరాటంలో బాబు పుట్టాడు. అప్పటి నుంచి నా సమస్య మరింత ఎక్కువైంది. ఆమెకు శృంగార కోర్కెలు తక్కువ. నాకేమో అధికం. ఎంతకీ శృంగారానికి ఒప్పుకోదు. 
 
ఒకవేళ ఒప్పుకున్నా.. ఎంతసేపూ అని గొణుగుతూ ఉంటుంది. ఏమాత్రం సహకరించదు. నాకేమో విపరీతంగా శృంగార కోర్కెలు. ఈ విషయాన్ని చెబితే నానా మాటలు అంటుంది. ఏం చేయాలి?
 
ఇటువంటి పరిస్థితి చాలా కొద్దిమందికి ఎదురవుతుంటుంది. ఆమె అలా నిరాకరించడానికి కారణాలు ఏమిటో ముందుగా కనుక్కోవాలి. అవేమీ తెలుసుకోకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు శృంగార కోసమే భార్య అన్నట్లు చూడకూడదు. ఆ కోణంలో సావధానంగా ఆమె మనసును తెలుసుకోండి. మీరు కోరుకున్న శృంగార సామ్రాజ్యం సొంతమవుతుంది మరి.