1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Uncle angry on Affair with Neighbor, she murdered him

పక్కింటి యువకుడితో ఎఫైర్... మామ వద్దన్నందుకు ఆ పని చేయించింది...

Uncle
పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం వద్దని వారించిన మామయ్యను కాటికి పంపింది ఓ కోడలు. ఈ ఘటన బాన్సువాడకు సమీపంలోని చిన్నరాంపూర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను చూస్తే... తెలివిలేని యువకుడికిచ్చి సదరు యువతిని పెళ్లి చేశారు. తన భర్త అమాయకుడు కావడంతో ఇక సంసారానికి పనికిరాడని నిర్ణయానికి వచ్చిన కోడలు పొరుగింటి యువకుడితో సంబంధం పెట్టుకుంది.
 
ఈ విషయం ఆమె మామయ్య గంగారాంకు తెలియడంతో ఆమెను పిలిచి మందలించాడు. అక్రమ సంబంధం వద్దంటూ హెచ్చరించాడు. దానితో ఆగ్రహం చెందిన ఆమె తన మామయ్య అడ్డు తొలగించుకుంటే ఇక తమ సంబంధానికి ఢోకా వుండదని, ప్రియుడికి ఫోన్ చేసి తన మామను చంపేయాలని చెప్పింది. 
 
అదను కోసం చూస్తున్న ప్రియుడు రాజుకి గంగారం కుంట్లమోరి వంతెన నిర్మాణ పనుల వద్ద వాచ్‌మెన్‌గా పనిచేయడం బాగా కలిసి వచ్చింది. ఆ వృద్ధుడు నిద్రిస్తున్న సమయంలో అతడిపై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఐతే ఈ హత్యపై పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో నిజం బయటపడింది. నిందితులను అరెస్టు చేశారు.
తర్వాతి కథనం
శబరిమలలో వినూత్న నిరసన... దీపాలు పట్టుకుని 750 కి.మీలు....