శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (12:18 IST)

ప్రేమికుడితో ఆ సుఖం మరిచిపోలేని ప్రేయసి.. భర్తను రాళ్లతో కొట్టి..?

వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రేమికుడిపై వున్న మోజుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. ఈ ఘటన దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్, తిరుకూర్ణం ప్రాంతానికి చెందిన మణికంఠన్ (27). ఇతని భార్య గాయత్రీదేవి. ఈ దంపతులకు ఓ సంతానం వుంది. మణికంఠన్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. 
 
మణికంఠన్ ఉద్యోగ నిమిత్తం బయటూరికి వెళ్తూవుంటాడు. ఇంతలో గాయత్రి బుద్ధి మారింది. మణికంఠన్ స్నేహితుడైన కమలకణ్ణన్‌తో గాయత్రి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తన వివాహేతర సంబంధానికి భర్తను తప్పించుకోవాలనుకుంది. దీనికోసం భర్తను ప్రేమికుడితో కలిసి హతమార్చాలనుకుంది. 
 
పక్కా ప్లాన్ ప్రకారం.. మణికంఠన్‌కు మద్యం ఫూటుగా తాగించి.. అతనిని రాళ్లతో కొట్టి చంపారు.. గాయత్రి, కమలకణ్ణన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని ఆమె ప్రియుడు కమలకణ్ణన్‌ను అరెస్ట్ చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో ప్రేమికుడితో శృంగారానికి భర్త అడ్డుపడుతున్నాడని అందుకే చంపేశామని చెప్పారు.