శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (16:36 IST)

భార్య స్నేహితురాలికి కూల్ డ్రింక్ ఇచ్చాడు.. అత్యాచారం చేశాడు..

భార్యతో స్నేహితురాలు. అప్పుడప్పుడు ఇంటికొచ్చేది. స్నేహితురాలి భర్తే కదా అంటూ పలకరించింది. దీన్ని అదనుగా తీసుకున్న కామాంధుడు భార్య స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని ఊత్తుక్కోటలో చోటుచేసుకుంది. 
 
భార్య స్నేహితురాలికి కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన సిలంబరసన్ (22)కు షర్మిల అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఏడాదిన్నర వయస్సున్న బాలుడున్నాడు. 
 
ఇక షర్మిల స్నేహితురాలు (24) వీరింటికి వచ్చేది. దీంతో ఆ యువతిపై కన్నేసిన సిలంబరసన్ ఆమె లొంగదీసుకోవాలనుకున్నాడు. ఓసారి భార్యలేని సమయంలో సదరు యువతి ఇంటికి రావడంతో.. దాన్ని అదనుగా తీసుకున్న సిలంబరసన్.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం మత్తులోకి జారుకున్న ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనను ఫోన్‌లో షూట్ చేశాడు. 
 
ఈ వీడియో ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తూ.. పలుసార్లు లైంగిక దాడికి దిగాడు. దీంతో ఆ యువతి గర్భం ధరించింది. గత నెల 21న మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.