శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (11:27 IST)

శక్తికాంత్ దాస్ ఓ అవినీతిపరుడు : సుబ్రమణ్యస్వామి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ అవినీతిపరుడంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ దశ దిశను నిర్దేశించే టాప్‌ పోస్టుకు దాస్‌ను ఎంపిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
శనివారం హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె స్‌లో '2018 ఎన్నికల ఇంటరాక్షన్‌' కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత మీడియా మాట్లాడారు. శక్తి కాంతదాస్‌ను అవినీతి ఆరోపణలతోనే ఆర్థిక శాఖర్థి నుంచి తొలగించారన్నారు. 
 
అలాంటి వ్యక్తిని ఆర్బీఐకి గవర్నర్‌గా ఎలా తెస్తారని ప్రశ్నించారు. అయితే దాస్‌ ఎక్కడ, ఎలా అవినీతి చేశారన్న దానిపై వివరణ ఇవ్వలేదని సుబ్రహ్మణ్యస్వామి చెప్పుకొచ్చారు.