శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 24 డిశెంబరు 2018 (16:01 IST)

యూ... ఇడియట్స్... పవన్ 'గ్లాసు' గురించి పరాచికాలా?

జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు వచ్చిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఈ గాజు గ్లాసు గుర్తుపై కొందరు చేసిన కామెంట్లతో రచ్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం చెంబు గుర్తు ఇవ్వకుండా గాజు గ్లాసు ఇచ్చారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో గాజు గ్లాసు గుర్తు గురించి ఓ చిన్నసైజు యుద్ధం జరుగుతుందని అనుకోవచ్చు.
 
గాజు గ్లాసుపై విమర్శనాస్త్రాలు సంధించిన వారిపై జనసేన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూ... ఇడియట్స్... ఎన్నికల సంఘం ఓ పార్టీకి ఇచ్చిన చిహ్నంపై మీ పరాచకాలా... అంటూ మండిపడ్డారు. ఐతే వాళ్లు మాత్రం వెనక్కి తగ్గుతున్నట్లు లేదు. మరి ఈ కామెంట్ల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.