శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 22 డిశెంబరు 2018 (15:23 IST)

కుమారుడు శంకర పవనోవిచ్‌‌కు క్రిస్టియన్ లాంఛనాలు... కుటుంబంతో పవన్ యూరప్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలసి యూరప్ బయలుదేరి వెళ్లారు. తన కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను ఈ క్రిస్టమస్ తరుణంలో పూర్తిచేయాలని కళ్యాణ్ శ్రీమతి అన్నా లెజెనోవా కోరడంతో తన కుటుంబంతో కలసి ఆయన యూరప్ వెళ్లారు. 
 
క్రిస్టమస్ పండుగ తరువాత ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. యూరప్ పర్యటన అనంతరం ఇక పూర్తికాలం అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.