శనివారం, 19 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (21:56 IST)

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

Thug Life First Single
Thug Life First Single
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ ‘జింగుచా’ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.  లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌తో దేశం మొత్తం థగ్ లైఫ్ వైపు చూసింది. 
 
ఈ వేడుకల్లో కమల్ హాసన్, మణిరత్నం, ఎ.ఆర్. రెహమాన్ సందడి చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన థగ్ లైఫ్ ప్రస్తుతం అందరి అంచనాలను అమాంతం పెంచేసింది. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘జింగుచా’ అనే ఫస్ట్ సింగిల్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించారు. ఇక రెహమాన్ బాణీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా ఉంది. 
Thug Life First Single
Thug Life First Single
 
థగ్ లైఫ్ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్, ఓవర్సీస్‌లో హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఏపీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఇక నార్త్ ఇండియాలో పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగులో శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. 
 
థగ్ లైఫ్ ఆడియో హక్కులను సారెగామా భారీ రేటుకి సొంతం చేసుకుంది. ఈ చిత్ర డిజిటిల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థగ్ లైఫ్ థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. జస్ట్ గ్రో ప్రొడక్షన్స్ సహకారంతో థగ్ లైఫ్ ఫెస్టివల్‌ను కూడా టీం ప్రకటించింది. ఇది మే 23వ తేదీన శుక్రవారం నాడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఈవెంట్ జరగనుంది. 
Thug Life First Single
Thug Life First Single
 
ఆ మ్యూజికల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. థగ్ లైఫ్‌లో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా నటించారు. శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా వంటి అనేక మంది ప్రశంసలు పొందిన నటీనటులు ముఖ్య పాత్రలను పోషించారు.

Thug Life First Single
Thug Life First Single