chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్
Rama Rama song poster
ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ - కంపోజర్ MM కీరవాణి స్వరపరిచిన రామ రామ ఏప్రిల్ 12న విడుదల కానుంది. సాంగ్ టైటిల్, పాట పోస్టర్ కూడా రామ రామ భక్తి గీతం అని సూచిస్తున్నాయి. ఈ పోస్టర్ లో చిరంజీవి చుట్టూ హనుమంతుడి వేషధారణలో ఉన్న పిల్లలు, బ్యాక్ డ్రాప్ లో రాముడి గొప్ప విగ్రహం ఉంది. సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట కోసం సాహిత్యం రాశారు.
తన బ్లాక్‌బస్టర్ ఫస్ట్ మూవీ బింబిసారతో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ట, విశ్వంభర ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు, దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తారు.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్
