సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 15 డిశెంబరు 2018 (19:09 IST)

ఆ విషయంలో మోడీని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్‌...

ప్రవాస భారతీయుల కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ లేఖ రాశారు. విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌ కఠినతరంగా ఉన్న హెచ్-1బి వీసాతో ఎన్ఆర్ఐలు పడుతున్న బాధను తెలుసుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల వెంట వచ్చి అమెరికా వీసా నిబంధనలను అడ్డుపడడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న సాటి భారతీయుల కోసం గొంతెత్తారు జనసేనాని.
 
ఈ సమస్యపై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి మోడీకి లేఖ రాశారు. ఇప్పటికే ప్రవాస భారతీయుల సమస్యలపై చర్చ కూడా జరిపారు పవన్. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీలను ఇదే విషయంపై జనసేనాని కలిశారు. ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో స్పష్టంగా వివరించారు. సాధ్యమైనంత త్వరగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిచేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌.