శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (15:30 IST)

పవన్‌తో వున్నది 12 సంవత్సరాలే.. ఆయనపై కవితలా? రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ మళ్లీ సీన్లోకి వచ్చింది. ''ఎ లవ్ అన్‌కండిషనల్'' అంటూ రేణూ దేశాయ్ ఓ పుస్తకాన్ని రాసింది. ఆమె రాసుకున్న కవితలతో ఓ పుస్తకాన్ని రూపొందించింది. ఈ కవితలు అద్భుతంగా వున్నాయంటూ.. వాటిని తెలుగులోకి అనువదించిన లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ మెచ్చుకున్నారు. కానీ రేణూ దేశాయ్ కవితలు తప్పకుండా పవన్‌ను ఉద్దేశించినవేనని టాక్ వచ్చింది. 
 
అందుకు రేణు స్పందించింది. పవన్‌తో తానున్నది 12 సంవత్సరాలే. ఆయన ప్రభావం తన కవితలపై ఎందుకు వుంటుందని రేణూదేశాయ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనకు ఇంకా 37 సంవత్సరాలని ఇన్నేళ్లలో పవన్‌తో తానున్నది 12 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఆయన ప్రభావం తన కవితలపై ఎందుకు వుంటుందని రేణూ దేశాయ్ ప్రశ్నిస్తోంది.