శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 5 డిశెంబరు 2018 (20:45 IST)

పవన్ కళ్యాణ్‌ పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నానంటున్న నటి? (Video)

తెలుగు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసే కొంతమంది నటులు పవన్ కళ్యాణ్‌‌కు మద్ధతుగా జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీలో చేరగా మరికొంతమంది బయట నుంచే సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా మిర్చి మాధవి కూడా పవన్ కళ్యాణ్‌ వెంట నడవడానికి సిద్థంగా ఉన్నానంటోంది. 
 
పవన్ కళ్యాణ్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు అన్నతో సమానం. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌‌ను కలిశాను. నాకు రాజకీయాల గురించి తెలిసిన అన్ని విషయాలను కూలకుషంగా వివరించారు. నా కుటుంబ నేపథ్యం గురించి కూడా తెలిపాను. నా సర్వం పవన్ కళ్యాణే. 
 
నా కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన అనుకుంటాను. అందుకే ఆయనతో పాటు కలిసి జనసేనలో చేరాలన్న నిర్ణయానికి వచ్చాను. త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నాను. ఆయన పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నానంటోంది నటి మిర్చి మాధవి. పవన్ పిలుపు కోసం ఇప్పటికే చాలామంది ఎదురుచూస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలతో సహా. మరి వాళ్లను పిలుస్తారో లేదో చూడాల్సి వుంది. ఇకపోతే... తెలంగాణలో ఓటు ఎవరికి వేయాలన్నదానిపై పవన్ కల్యాణ్ ఏం చెప్పారో చూడండి...