పవన్ కళ్యాణ్‌ నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పు కాదు... ఎవరు?

Pawan-Jagan
జె| Last Modified మంగళవారం, 4 డిశెంబరు 2018 (17:25 IST)
జనసేనాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్థం కొనసాగుతోంది. ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. నువ్వు మగాడివా అంటూ జగన్‌ను విమర్సించారు పవన్ కళ్యాణ్‌.. నీలాగా నిత్యపెళ్ళికొడుకు కాదంటూ పవన్ కళ్యాణ్‌ పైన బాణాలు ఎక్కుపెట్టారు జగన్. ఈ ఇద్దరు నేతలు ఎందుకిలా రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగుతున్నారు.

ఎపిలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పోటాపోటీగా పార్టీలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎపిలో కొత్తగా ఉన్న పార్టీ జనసేన. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా ఎపిలోని 13 జిల్లాల్లో సుడిగాల పర్యటన చేస్తూ పార్టీని పటిష్టం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు‌. గత కొన్నిరోజుల ముందు వరకు అధికార తెలుగుదేశం పార్టీ నేతలపైన విమర్శలు చేస్తూ వచ్చిన పవన్ ఆ తరువాత రూటు మార్చారు. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ పైన విమర్శలు ఎక్కుపెట్టారు.

పవన్ కళ్యాణ్‌ స్టైలే సపరేటు. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా విరుచుకుపడతారో.. ఎందుకు విరుచుకుపడతారో పక్కనున్న వారికి కూడా తెలియని పరిస్థితి. అయితే అధికారపక్షంపై మాటల దాడి చేస్తూ వచ్చిన పవన్ ప్రతిపక్షంతో సాన్నిహిత్యంగా ఉంటారని భావిస్తున్న సమయంలో ఒక్కసారిగా వైసిపి అధినేతపైన వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిగా జగన్ కూడా పవన్ పైన వ్యక్తిగత దూషణలకు దిగడంతో తీవ్ర కలకలం రేపుతోంది.


మళ్ళీ వైసిపికి జనసేన దగ్గరవుతోందా అని అందరిలో అనుమానాలు వస్తున్న నేపథ్యంలో గత వారంరోజుల నుంచి తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్‌. వైసిపిపైన ఆ పార్టీ అధ్యక్షుడిపైన ఓ రేంజ్‌లో ఆరోపణలు గుప్పించారు. దేశంలోనే జగన్ అంత అవినీతిపరుడు లేడంటూ ఆ పార్టీకి ఓటేయద్దంటూ పిలుపునిస్తున్నారు. వారం రోజులుగా పవన్ వ్యాఖ్యలను గమనిస్తూ వచ్చిన జగన్ కూడా సంయమనం పాటించారు. అయితే మగతనం గురించి మాట్లాడటంతో జగన్ మోహన్ రెడ్డికి కూడా చిర్రెత్తుకొచ్చింది. దీంతో పవన్ పైన బాణాలు ఎక్కుపెట్టారు. నలుగురు భార్యలు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక భార్యను మార్చడం పవన్‌కు ఉన్న అలవాటు. ఆయన కూడా నాపై విమర్శలు చేస్తారా అంటూ జగన్ ప్రశ్నించారు. పవన్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలను వైసిపి నేతలు సమర్థిస్తున్నారు.

పవన్ నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని, అయితే దాన్ని ఆధారంగా చేసుకుని జగన్ విమర్శలు చేయడం మాత్రం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌‌ల మధ్య తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలు జరుగుతుండటంతో ఒక్కసారిగా ఎపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి.దీనిపై మరింత చదవండి :