శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (14:44 IST)

సంపాదనలో స్టార్లు : టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ టాప్ .. బాలీవుడ్‌లో కండలవీరుడు

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ యేడాది బాగా సంపాదించిన స్టార్ హీరోల పేర్లతో కూడిన ఓ జాబితాను అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. మొత్తం ఫోర్బ్స్-100 పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో బాలీవుడ్ నుంచి హీరో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈయన 2018 సంవత్సరంలో అక్షరాలా రూ.253.25 కోట్లు సంపాదించినట్టు ఆ పత్రిక పేర్కొంది. 
 
ఇక టాలీవుడ్‌కు వస్తే జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈయన రూ.31.33 కోట్లతో ఇతర హీరోల కంటే ముందున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రూ.28 కోట్లు, ప్రిన్స్ మహేష్ బాబు రూ.24.33 కోట్లు, నాగార్జున రూ.22.65 కోట్లు, అల్లు అర్జున్ రూ.15 కోట్లు, రామ్ చరణ్ రూ.14 కోట్లు, విజయ్ దేవరకొండ రూ.14 కోట్లు, దర్శకుడు కొరటాల శివ రూ.20 కోట్లను సంపాదించారు. 
 
కోలీవుడ్ విషయానికి వస్తే "2.O" హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 కోట్లలో అగ్రస్థానంలో ఉండగా, విజయ్ రూ.30.33 కోట్లు, విక్రమ్ రూ.26 కోట్లు, విజయ్ సేతుపతి రూ.23.67 కోట్లు, ధనుష్ రూ.17.25 కోట్లు, నయనతార రూ.15.17 కోట్లు, చొప్పున అర్జించారు. అయితే, ఓవరాల్‌గా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మొదటిస్థానంలో ఉంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.228.09 కోట్లు, మరో హీరో రూ.185 కోట్లుతో రెండుమూడు స్థానాల్లో ఉన్నారు.