సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (10:48 IST)

అమెరికాలో పవన్ టూర్ : కులమతాలపై నమ్మకంలేదు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. గత ఆరు రోజులుగా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ తన పర్యటనను సోమవారంతో ముగించుకోనున్నారు. ఆయన డల్లాస్‌లోని ఎన్నారై వైద్యులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎన్నడు కూడా కలమతాలను నమ్మలేదని కేవలం మనుషులను మాత్రమే నమ్ముకున్నట్టు చెప్పారు. అన్ని పార్టీలకు కులాలకు సంబంధించిన విభాగాలు ఉన్నాయనీ, కానీ తమ పార్టీలో మాత్రం వాటికి చోటులేదన్నారు. అదేసమయంలో వైద్యుల విభాగం మాత్రం ఉంటుందని చెప్పారు. 
 
వైద్యులకు ప్రభుత్వాల నుంచి తగిన మద్దతు లభించలేదన్నారు. పైగా, ప్రజలకు సేవ చేయడం అనేది ఓ అడిక్షన్‌ అని, దానికి అలవాటుపడితే అందులో లభించే సంతృప్తి మరోలా ఉంటుందన్నారు. రాజకీయ, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని వచ్చే 25 యేళ్లపాటు ఫణంగా పెట్టినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఇమ్మిగ్రేషన్ విధాలంతో పాటు.. హెచ్1బీ విసాల మంజూరులో అమెరికా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విధానాలపై పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాయనున్నట్టు ఆయన వెల్లడించారు.