గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (19:32 IST)

చంద్రబాబు గురించి ఇక్కడ మాట్లాడనన్న పవర్ స్టార్... అది సూపర్బ్ అన్న చెర్రీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అమెరికా డల్లాస్‌లో ఎన్నారైల వీసా ఇబ్బందుల గురించి మాట్లాడిన తీరు అక్కడివారిని బాగా ఆకట్టుకుంది. సుమారు 4వేల మంది హాజరైన ఈ సమావేశంలో ఓ వ్యక్తి లేచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి మీరేం చెపుతారు అని ప్రశ్నించగా... అది రాష్ట్రంలోనే. 
 
దేశం బయటకు వస్తే రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడబోను అని చెప్పారు. దాంతో సభికుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వచ్చాయి. ఆ తర్వాత వీసా సంబంధిత సమస్యలపై ప్రధానమంత్రికి లేఖ రాస్తానంటూ చెప్పిన పవన్ కల్యాణ్ ఇంకా ఎన్నో అంశాలపై మాట్లాడారు. ఈ ప్రసంగాన్ని ఆసాంతం విన్న రాంచరణ్ బాబాయి పవర్ స్టార్ స్పీచ్ ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా చెర్రీ... ది మ్యాన్, ది లీడర్, ది విజనరీ #PSPK అంటూ పోస్ట్ చేశారు.