వినయ విధేయ రామ సెకండ్ సింగిల్ అదిరింది..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సస్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పైన రూపొందుతోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ఈసినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌కి మంచి స్పందన వచ్చింది.
ఈ మూవీలోని సెకండ్ సింగిల్‌ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. రొమియో జూలియట్ మళ్లీ పుట్టినట్టు ఉంటదంటా మన జట్టు .. వాళ్ల కథలో క్లైమాక్స్ పాజిటివ్‌గా రాసినట్టు .. మన లవ్ స్టోరీ హిట్టు .. అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట కొనసాగుతోంది.
మోనాలిసా నవ్వు .. సన్నజాజి పువ్వు ఒక్కటైతే నువ్వు.. వేడివేడి లావా స్వీటు పాలకోవ ఒక్కటైతే నువ్వు అనే పద ప్రయోగాలు బాగున్నాయి. శ్రీమణి సాహిత్యం.. జస్ ప్రీత్.. మనసి ఆలాపన ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్, మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.