సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (13:01 IST)

పెళ్లయిన హీరోయిన్‌పై మనసుపడిన ఎస్.ఎస్.రాజమౌళి

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభంకాగా, హీరోయిన్లతో ఇతర నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. 
 
అయితే, మాజీ హీరోయిన్ ప్రియమణి ట్రిబుల్ ఆర్‌లో ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ'లో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ సినిమా ప్రియమణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 
 
ఆ తర్వాత కొంత మంది స్టార్ హీరోలతో ప్రియమణి నటించింది. వివాహం తర్వాత ప్రియమణి నటనకు దూరం కావడంతో మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కానీ, ట్రిపుల్ ఆర్ చిత్రం ద్వారా ప్రియమణి మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుందని అంటున్నారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా ప్రియమణి కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.