శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (14:06 IST)

అమ్మో.. ఇలియానా అంత అడిగిందా..? షాకైన రామ్ చరణ్

ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అమర్ అక్బర్ ఆంటోనీలో అమ్మడు గ్లామర్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. హీరోయిన్‌గా మెరవలేకపోయింది.


బొద్దుగా కనిపించి.. క్రేజ్ కొట్టలేకపోయింది. దీంతో ఇక ఇలియానా ఐటమ్ సాంగ్స్‌ వరకే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. ఇందులో భాగంగా రామ్ చరణ్-బోయపాటి సినిమాలో ఇలియానాను ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారట. 
 
అయితే ఐటమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకున్న ఇలియానా.. పారితోషికం విషయంలో రాజీ పడలేదట. ఒక ఐటమ్ సాంగ్ కోసం రూ.60లక్షల పారితోషికం అడిగిందట. దీంతో షాకైన దర్శకనిర్మాతలు చెర్రీకి ఈ విషయం చెప్పారట. దీంతో చెర్రీ కూడా షాకై.. మౌనం వహించాడని.. చివరికి ఐటమ్ సాంగ్ కోసం ఇలియానాకు అడిగిన మొత్తాన్ని అప్పచెప్పాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.