సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (13:20 IST)

డీఎస్పీ దూకుడుకు ముకుతాడు.. త్వరలో పెళ్లి .. వధువు ఎవరో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ సెలెబ్రిటీల్లో ఒకరు డీఎస్పీ అలియాస్ దేవీశ్రీ ప్రసాద్. ఈయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈయన పెళ్లి చేసుకోనున్న అమ్మాయి ఎవరో కాదు.. పూజిత. షార్ట్ ఫిల్మ్స్‌లలో నటిస్తూ ఆ తర్వాత సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తున్న నటి. అలా చెబితే గుర్తుకు రాకపోవచ్చు. 
 
ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటి 'రంగస్థలం'. ఈ చిత్రంలో ఆది పినిశెట్టికి ప్రియురాలిగా, ప్రకాష్ రాజ్ కుమార్తెగా నటించిన నటి. ఈమెతో డీఎస్పీ పెళ్లంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
 
నిజానికి హీరోయిన్ ఛార్మితో పెళ్లిఖాయమనే వార్తలు గతంలో హల్‌చల్ చేశాయి. కానీ అవి కేవలం వార్తలకే పరిమితమయ్యాయి. పెళ్లిమాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో నటి పూజితతో డీఎస్పీ పెళ్లి వార్తల ఇపుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
'రంగస్థలం' చిత్రం కోసం పని చేసే సమయంలో డీఎస్పీ - పూజిత మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం అది పెద్దలు కుదిర్చిన సంబంధంగా చెబుతున్నారు. అయితే, ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాల్సివుంది.