శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (15:52 IST)

ప్రేమ పెళ్ళి చేసుకుంది.. మొగుడి ఫ్రెండ్‌తో జంపయ్యింది... ఎక్కడ?

ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. జీవితాంతం కలిసి ఉంటామని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. కానీ ఆ ప్రేమ మధ్యలో ఆగిపోయింది. ఇద్దరు పిల్లల్ని కాదనుకుని కుటుంబాన్ని వదిలి నిర్దాక్షిణ్యంగా భర్త స్నేహితునితో వేరు కాపురం పెట్టిందో భార్య. నెల్లూరు జిల్లా కాటుకూరులో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
 
ఖమ్మం జిల్లాకు చెందిన సంధ్యకు, నెల్లూరు జిల్లా కాటుకూరుకు చెందిన మహేశ్వరరావు 7 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తరువాత భార్యను తన సొంత ఊరికి తీసుకువచ్చి కాపురం పెట్టాడు మహేశ్వరరావు. ఏడేళ్ళ పాటు వీరి జీవితం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంత ఊరిలో పరిస్థితి బాగా లేకపోవడంతో హైదరాబాదులో ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో చేరాడు మహేశ్వరరావు. 
 
నెల రోజుల పాటు అక్కడే ఉండి సెలవు దినాల్లో మాత్రమే ఇంటికి వచ్చేవాడు. భార్యకు సహాయం కోసం తన స్నేహితుడు నాగార్జునను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి రమ్మనేవాడు. ఇంట్లో నిత్యావసర వస్తువులు లేకున్నా, పిల్లలకు బాగా లేకున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళమని కోరేవాడు. ఇదే అదునుగా నాగార్జున సంధ్యపై కన్నేశాడు. పురుగుల మందు బాటిల్ తీసుకెళ్ళి సంధ్యను బెదిరించాడు. తన కోరిక తీర్చకుంటే విషం తాగి చచ్చిపోతానన్నాడు. దీంతో భయంతో సంధ్య నాగార్జున కోరిక తీర్చింది. తామిద్దరం ఏకాంతంగా ఉన్న వీడియోలను సెల్‌ ఫోన్‌లో తీసి పలుమార్లు బెదిరించి కోర్కె తీర్చుకున్నాడు.
 
ఇలా వీరి మధ్య మూడునెలల పాటు తతంగం జరిగింది. విషయం కాస్త భర్తకు తెలిసింది. అయితే తన ఇద్దరు పిల్లలను వదిలి నాగార్జునతో వేరు కాపురం పెట్టింది సంధ్య. ఆమెతో నెలరోజుల పాటు ఉన్న నాగార్జున ఆ తరువాత వదిలేశాడు. ఇంట్లో నుంచి తోసేశాడు. దీంతో కట్టుకున్న వాడు దూరమై, ప్రేమించిన వాడు తరిమేయడంతో సంధ్య ఒంటరిగా మిగిలిపోయింది.