సంబంధిత వార్తలు
- ఉదయం పాట్నాలో ఫ్లైట్ ఎక్కాడు.. సాయంత్రం హైదరాబాద్‌లో పనికానిచ్చాడు..?
- ప్రియుడితో కలిసి ఎయిడ్స్ సోకిన భర్తను హత్య చేసిన ఇల్లాలు
- ఏమండీ ఇక్కడ 1000 రూపాయలు పెట్టాను.. కనిపించడం లేదు..?
- కట్టుకున్న భర్తను.. పదేళ్ల కుమార్తెను వదిలి.. 19 ఏళ్ల యువకుడితో?
- పెళ్లి పేరుతో మోసం చేస్తే ఎన్నారైలను అరెస్ట్ చేయాల్సిందే.. సుప్రీం
రాత్రిళ్లు పడక గదిలో చేసేది పొద్దున్నే డైరీలో రాస్తాడు.. ఏం చేయాలి?
మా ఆయనకు ఓ వింత అలవాటు ఉంది. రోజువారీ చేసే పనులు రాస్తోడో లేదో తెలియదుకానీ, రాత్రిపూట పడక గదిలో చేసేది మాత్రం క్రమం తప్పకుండా డైరీలో రాస్తుంటాడు. ముఖ్యంగా శారీరకంగా కలిసిన ప్రతిసారి.. బెడ్‌పై మేము చేసుకున్న ప్రతి పని, ప్రతి మాట తు.చ తప్పకుండా రాస్తాడు. అలా ఎందుకు చేస్తారో అర్థంకాదు. దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఏదైనా కొత్త ప్రయోగం చేద్దామని ప్రతిపాదిస్తే అది కూడా ఎలా వర్ణిస్తాడోనని భయం పట్టుకుంది. పైగా, ఇదే విషయంపై ఆయన్ను అడుగుదామనుకుంటే ఏమనుకుంటారో.. ఎలా స్పందిస్తారోనని అని జంకాల్సి వుంటుంది. ఆయన చర్య వల్ల పడకగది వాతావరణం పూర్తిగా చెడిపోతోంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. ఏదైనా సలహా ఇవ్వండి.
కామ కోర్కెలు తగ్గిపోయి, అసంతృప్తి చెందడం వల్లే కొందరు పురుషులు ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు. చేస్తున్న పనిమీదకాకుండా మరెక్కడో మనసు లగ్నం చేస్తారు. 'నేను ఎలా పాల్గొంటున్నాను.. అది ఆయన మెచ్చుకుంటారా? లేదా?' అని మీరు.. 'నేను ఆమెకు తగినట్టుగా చేస్తున్నానా? లేదా? నా ఫ్రెండ్స్, చేస్తున్న తీరులోనే నేను కూడా చేస్తున్నానా? లేదా?' అని ఆయన అలోచిస్తుంటే పడక గది జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది.
అసలు పడక గదిలో జరిగే విషయాలు డైరీలో రాసే అలవాటు ఎందుకు అలవడిందో ఓసారి తెలుసుకోండి. చాలా మంది మగాళ్లు అశ్లీల చిత్రాలు, అశ్లీల బొమ్మలు చూసి అందులోని విధంగా చెయ్యాలని అనుకుంటారు. ఆ విధంగా ఏమైనా చేస్తున్నారేమోనని గుర్తించండి. ఏది ఏమైనా ఇది మంచి అలవాటు ఏమాత్రం కాదు. ఆయన శృంగార సామర్థ్యం గురించి ఎప్పుడైనా మీతో మాట్లాడారా! లేదంటే మీరే మాట్లాడి చూడండి. అయినా లొంగకపోతే ఆ డైరీ గురించి పట్టించుకోనట్టుగా ఉండండి. కొన్నాళ్లు రాసి ఆయనే మారతాడు.
తర్వాతి కథనం
