గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (17:11 IST)

కట్టుకున్న భర్తను.. పదేళ్ల కుమార్తెను వదిలి.. 19 ఏళ్ల యువకుడితో?

కట్టుకున్న భర్తను.. పదేళ్ల కుమార్తెను వదిలి.. 19 ఏళ్ల యువకుడితో పారిపోయింది. 19 ఏళ్ల యువకుడి భార్య పారిపోయిందని.. పరువు పోయిందనే మనస్తాపంతో.. ఆ భర్త కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని ధర్మపురిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. ధర్మపురికి చెందిన మారియప్పన్‌(45), మురుగమ్మాళ్‌(36) దంపతులకు తమిళ్‌ అనే పదేళ్ల కూతురు ఉంది. కానీ సోమవారం తన కుమార్తెతో కలిసి ధర్మపురి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన మారియప్పన్‌ తనతో పాటు కూతురిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించారు. ఇది గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై మారియప్పన్ వద్ద పోలీసులు విచారణ జరుపగా, తన భార్య మురుగమ్మాళ్‌ 19 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటి నుంచి పారిపోయిందని చెప్పాడు. వెళ్తూ వెళ్తూ.. ఇంట్లోంచి 13 తులాల బంగారం నగలు, రూ.2.5 లక్షల నగదు పట్టుకెళ్లినట్లు వాపోయాడు. యువకుడితో పారిపోయిన తన భార్యను వెతికిపెట్టాలని పోలీసుల వద్ద మారియప్పన్ వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.