40 సవర్ల బంగారాన్ని చోరీ చేసింది.. అడ్డంగా దొరికిపోయింది...
పెళ్లి కోసం వచ్చింది.. 40సవర్ల బంగారాన్ని చోరిచేసింది. పెళ్లి కంటూ వెళ్లి తన బుద్ధి చెప్పింది. అయితే అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గతనెల 16న నెల్లూరు చంద్రమౌళినగర్‌కు చెందిన కొండారెడ్డి, రమాదేవి దంపతులు కనిగిరిలో జరుగుతున్న బంధువుల వివాహానికి వచ్చారు.
విశ్రాంతి తీసుకునేందుకు వారికి ఓ లాడ్జిలో బస ఏర్పాటు చేయగా, వారి గదిలోనే విశ్రాంతి నిమిత్తం మరికొందరు బంధువులు వచ్చారు. వారందరూ చూస్తుండగానే రమాదేవి తన నగలను తీసి ఓ బ్యాగులో భద్రపరిచింది. దీన్ని చూసిన తడకు చెందిన తేజశ్రీ అనే మహిళ, కరెంట్ పోయిన సమయాన్ని అదనుగా చూసి, వాటిని కాజేసింది.
మరుసటి రోజు పెళ్లి సమయంలో ధరించేందుకు నగల కోసం వెతికితే అవి కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీంతో ఎనిమిది మంది మహిళలను విచారించిన పోలీసులు రూ. 8.48 లక్షల విలువైన నగలను తేజశ్రీ నుంచి స్వాధీనం చేసుకున్నారు.