మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (10:20 IST)

బాయ్‌ఫ్రెండ్సే కదా అని వెళ్తే.. బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేసి.. ఆపై?

బాయ్‌ఫ్రెండ్సే కదా అని నమ్మింది. వారితో కలిసి తిరిగింది. ఓసారి బర్త్ డే పార్టీ అని చెప్తే వారి వెంటే వెళ్లింది. కానీ బర్త్ డే పార్టీకంటూ తీసుకెళ్లి.. ఇద్దరు యువకులు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని కంచరపాలెం, కప్పరాడ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు, నలుగురు యువతులు తమ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి ద్విచక్రవాహనాలపై వెళ్లారు. పార్టీలో బాగా ఎంజాయ్ చేసి.. గురువారం సాయంత్రం అవే ద్విచక్రవాహనాలపై వెనుదిరిగారు. 
 
కానీ శొంఠ్యాం సమీపంలోని ఓ కళాశాలకు వచ్చే సమయంలో ఆ ఆరుగురు యువకుల్లో ఇద్దరు యువకులు వారితో వచ్చిన ఓ యువతిని బలవంతంగా లాక్కెళ్లి.. అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఇంటి వద్ద వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.