శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (11:14 IST)

అంట్లు తోముతూ అడ్డంగా కూర్చుంది.. దారి ఇవ్వలేదని కర్రతో కొట్టి చంపిన బావ

మరదలిని బావ హతమార్చిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అంట్లు తోముకుంటున్న మరదలు దారికి అడ్డుగా వుందని.. బావ ఆమెను చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు, పటవల శాంతిమూల ఎస్సీపేటలో పోలినాటి నాగమణి నివాసం ఉంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు. 
 
పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం, రెండో కుమారుడు శ్రీనివాస్‌‌లు ఒక ఇంట్లో, మూడో కుమారుడు సత్యనారాయణ, ఆయన భార్య మాధవి మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె, 15 నెలల కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డుపై మాధవి అంట్లు తోముతుండగా, ఆమె బావ శ్రీనివాస్ మద్యం తాగి అటుగా వచ్చాడు. 
 
ఇలా అడ్డుగా కూర్చుంటే, తన ఇంట్లోకి ఎలా వెళ్లాలి? అంటూ ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. పక్కనుంచి వెళ్లాలని మాధవి చెప్పగా, పక్కనే ఉన్న కర్ర తీసుకుని, ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మాధవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.