శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (14:31 IST)

అప్పు తిరిగి అడిగాడని.. కట్టి, చంపేసి.. ఏం చేశారో తెలుసా..?

అవసరానికి అప్పు ఇచ్చాడు.. కానీ, తీసుకున్న వ్యక్తి తిరిగి అడిగాడని అతనిని చంపేశారు. దాంతో వదిలిపెట్టకుండా.. మృతదేహాన్ని 25 ముక్కలుగా నరిగి బ్యాగుల్లో వేసి తీసుకెళ్ళారు. ఈ దారుణ ఘటన ఢీల్లీలోని గుర్గావ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హర్నీక్ సింగ్, జన్‌కరణ్ సింగ్ కలిసి బిజినెస్ చేస్తున్నారు. అయితే హర్నీక్ సింగ్ అతనికి 40 లక్షలు అప్పుగా కావాలని అడిగాడు. అడిగిన వెంటనే జన్‌కరణ్ సింగ్, హర్నీక్ సింగ్‌కి అప్పుగా ఆ డబ్బు ఇచ్చాడు.
 
కొన్ని రోజుల పాటు అలా గడిచింది. ఆ తరువాత ఓ నాడు జన్‌కరణ్ సింగ్.. హర్నీక్ సింగ్‌ను నగదును చెల్లించమని పలుమార్లు అడిగాడు. కానీ, హర్నిక్ సింగ్ దాని గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దాంతో జన్‌కరణ్ సింగ్, హర్నిక్ సింగ్ నివాస స్థలానికి అక్టోబర్ 14వ తేదీన వెళ్ళాడు. డబ్బు కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంతకీ డబ్బు అడిగినా ఇవ్వకపోవడంతో జనకరణ్ సింగ్ కోపగించుకున్నాడు. 
 
అప్పుడు హర్నిక్ సింగ్ ఇదే మంచి సమయమని.. అతను తన భార్య గుర్మీహర్ కౌర్‌, మరో వ్యక్తి కలిసి జన్‌కరణ్ సింగ్‌ను కట్టేసి హత్య చేశారు. దాంతో వదిలేయకుండా.. అతడి శరీరాన్ని 25 ముక్కలుగా నరికి 2 ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి నింపారు. ఆ తర్వాత తన సొంత నివాస స్థలమైన పంజాబ్‌కు హర్నిక్, తన భార్య కలిసి జన్‌కరణ్ మృతదేహాన్ని తీసుకుని బయల్దేరి.. మధ్య ప్రయాణంలో నిర్మానుష్య ప్రదేశంలో ఆ బ్యాగులను వదిలేశారు.

ఆ తర్వాత భయంతో తాము పట్టుబడతామని భావించి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత హర్నీక్ తన మనసు మార్చుకున్నాడు. భార్య నిజం చెప్పేస్తుందని ఆమె గొంతు కోసి హతమార్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.